రెండో టెస్ట్ : మయాంక్ సెంచరీ.. అవుట్ !

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 108 (194బంతుల్లో, 16ఫోర్లు, 2సిక్స్ లు) సెంచరీ చేశాడు. ఐతే, సెంచరీ చేసిన కొద్దిసేపటికే రబడా బౌలింగ్‌లో  డూ ప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు హాఫ్ సెంచరీ (58)తో ఊపుమీద కనిపించిన పుజారాని రబాడానే అవుట్ చేశాడు. ఈ క్యాన్ ని డూ ప్లెసిస్‌నే అందుకొన్నాడు. ప్రస్తుతం భారత్ 198/3 (62.1ఓవర్లు) స్కోరుతో ఆటని కొనసాగిస్తోంది. క్రీజులో కోహ్లీ (8), రహానే (0) ఉన్నారు. 

అంతకుముందు లంచ్ సమయానికి భారత్‌ 52 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. లంచ్ తర్వాత మయాంక్‌ అగర్వాల్‌ వేగంగా సెంచరీ పూర్తి చేసుకొన్నాడు. ఆ కొద్దిసేపటికే పెలివియన్ కి చేరాడు. ఇక టెస్టుల్లోనూ ఓపెనర్ గా ప్రమోషన్ పొందిన రోహిత్ శర్మ 14 పరుగులు చేసి రబడా బౌలింగ్‌లో  అవుటయ్యాడు. భారత్ కోల్పోయిన మూడు వికెట్లని రబడానే తీయడం విశేషం. మొదటి రోజు పిచ్ ఫాస్ట్ బౌలింగ్‌ కు అనుకూలిస్తోంది. పోను.. పోనూ పిచ్ స్పిన్నర్ కి అనుకూలంగా మారుతుందని చెబుతున్నారు.