జగన్’తో చిరు భేటీ వెనక పొలిటికల్ ప్లాన్ ?


మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11గంటలకి చిరు, రామ్ చరణ్ ఇద్దరు కలిసి జగన్ తో సమావేశం కానున్నారు. చిరు తాజా చిత్రం ‘సైరా’ విషయంలో ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో సైరా సినిమాని రోజుకి ఆరు షోలకి అనుమతిని ఇచ్చింది. ఇదీగాక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో చిరు భేటీ ప్రాధాన్యతని సంతరించుకొంది. చిరు, చరణ్ సీఎం జగన్ కి ప్రత్యేక కృతజ్ఝతలు తెలియజేయనున్నారని తెలుస్తోంది. 

ఇదీగాక ఈ భేటీ వెనక పొలిటికల్ పొలిటికల్ ఏమైనా ఉందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయ్. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరు రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. అయినా.. త్వరలోనే చిరు జనసేనలో చేరబోతున్నారు. కాదు.. బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ చిరుని ఫాలో అయ్యే, ఆయన మాట వెనే రాజకీయ నాయకులు ఉన్నారు. ఇటీవల మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చిరుని కలిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇప్పుడే వైసీపీలో చేరవద్దని చిరు గంటాకి సూచించారట. ఈ నేపథ్యంలోనే గంటా మళ్లీ తెదేపాలో యాక్టివ్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. 

దీని వెనక చిరు పొలిటికల్ ప్లాన్ ఏమైనా ఉందా ? ఆయన తన అనుచరులతో కలిసి ఏదైనా పార్టీలో చేరనున్నారా ? అది వైసీపీ యే కానుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ఇదీగాక చిరు ఆయన అనుచరులు కలిసి ఒకేసారి జనసేన తీర్థం పుచ్చుకొని వైసీపీ కలిసి ఏపీలో తెదేపా లేకుండా చేసే ప్లాన్ లో ఏమైనా ఉన్నారా ?? అనే అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తానికి సీఎం జగన్ తో చిరు భేటీ సీనీ, రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.