అణచివేస్తే.. ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవ్ !

సమ్మెలు, ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేస్తే ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందులు తప్పవన్నారు కార్మిక సంఘాల ఐకాస ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణని కోర్టు ఈ నెల 15కి వాయిదా వేసింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టుకు తమ వాదన వినిపించామని కార్మిక సంఘాల ఐకాస ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి అన్నారు.

ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సాయంత్రం 4 గంటల తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు తమకు నోటీసులు రాలేదని.. వస్తే స్పందిస్తామన్నారు. సమ్మెలు, ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేస్తే ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందులు తప్పవన్నారు.