గొల్లపూడి మారుతీరావు ఇకలేరు


ప్రముఖ రచయిత, సంపాదకుడు, నటుడు గొల్లపూడి మారుతి రావు (80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఆయన కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన అనారోగ్యంతో చెన్నై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అపోలో హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు. అప్పటి నుంచి గొల్లపూడి ఆసుపత్రికే పరిమితం అయ్యారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు.

గొల్లపూడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. మారుతీరావు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. పత్రికలో పనిచేస్తూనే రచయితగా మారి అనేక కథలు, నాటకాలు రాశారు. 1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాశాడు. మారుతీరావుకు అది మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డు లభించింది.

మారుతీరావు నటునిగా ప్రధానపాత్ర పోషించిన తొలి చిత్రం, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఘనవిజయం సాధించిన తరువాత వెనుదిరిగి చూడవలసిన అవసరం కలుగలేదు. 250 చిత్రాలకు పైనే, సహాయక నటుడిగా, హాస్య నటుడిగా వివిధ పాత్రలలో నటించాడు