చంద్రబాబు ఫ్యామిలీ రాజకీయాల వెనక.. !

తెదేపా అధినేత చంద్రబాబు ఫ్యామిలీ రాజకీయాలకి తెరలేపారు. ఆయన సతీమణి భువనేశ్వరీ ప్రత్యేక రాజకీయాలకి ఎప్పుడూ దూరంగా ఉండేవారు. ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకునేవారు. కానీ, ఈ మధ్య భువనేశ్వరీ రాజకీయాలపై స్పందిస్తున్నారు. బుధవారం అమరావతిలో చంద్రబాబు కలిసి రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఫ్యామిలీ రాజకీయాలకి తెరలేపడం వెనక వ్యూహాం ఏంటీ ? అనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది.

గత యేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా తెదేపా 23 స్థానాలకే పరితమైంది. మరోవైపు, చంద్రబాబు రాజకీయ వారసుడు, తెదేపా యువనేత నారా లోకేష్ పై పప్పు అనే ముద్రపడిపోయింది. తుడిపేస్తే చెదిరిపోయే ముద్ర కాదది. మరోవైపు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెదేపాకి దూరమైనట్టు కనిపిస్తోంది. మరోవైపు, తెదేపాకి మళ్లీ ఊపుతెచ్చే దమ్మూ కేవలం జూనియర్ ఎన్ టీఆర్ కి మాత్రమే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఫ్యామిలీ కార్డుని వాడుతున్నారని.. సతీమణి భువనేశ్వరిని ప్రత్యేక్ష రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని చెప్పుకొంటున్నారు. ముందు ముందు అవసరమైతే.. బాలయ్య కూతురు, లోకేష్ సతీమణి బ్రహ్మాణిని కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో తీసుకొచ్చే అవకాశాలున్నాయని చెప్పుకొంటున్నారు. ముందు చూపు కలిగిన చంద్రబాబు ఫ్యామిలీ కార్డుని తప్పక వాడుతున్నారని చెబుతున్నారు.