బాలయ్య.. బిగ్ ట్విస్ట్ !

బాలకృష్ణ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. వందో సినిమా “గౌతమీపుత్ర శాతకర్ణి” తర్వాత బాలయ్య స్వీడు పెంచాడు. ఆ స్వీడులోనే తన 101 సినిమాని పూరి దర్శకత్వంలో చేసేశాడు. పూరి-బాలయ్య కలయిక ఇండస్ట్రీ అస్సలు ఊహించనిది. ప్రస్తుతం బాలయ్య 102 సినిమా “జై సింహా” సీనియర్ దర్శకుడు కెయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కొద్దిరోజుల నుండే బాలయ్య 103 సినిమాపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలయ్య తదుపరి సినిమా ఉండబోతుందని ప్రచారం జరిగింది. ఐతే, బాలయ్య బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. తన తదుపరి సినిమా యవ దర్శకుడు అనిల్ రాఘవపూడి దర్శకత్వంలో చేసేందుకు రెడీ అయ్యారు.
గతంలో బాలయ్య వందో సినిమా కోసం అనిల్ రాఘవపూడి ఓ కథ వినిపించాడు. ఆ సినిమా కోసం ‘రామారావు గారు’ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడిదే కథని సెట్స్ మీదకు తీసుకెళ్తారా ? లేదంటే.. ? బాలయ్య కోసం అనిల్ కొత్త కథని రెడీ చేశారా ?? అనేది తెలియాల్సి ఉంది. ‘రామారావు గారు’ బాలయ్యకు బాగా నచ్చిన కథ.. కాబట్టి బాలయ్య ‘రామారావు గారు’నే రావొచ్చు.
