పార్లమెంట్‌లో హై అలర్ట్.. ఏం జరిగిందంటే ?

పార్లమెంట్ ఆవరణలో హై అలర్ట్ వాతావరణం కనిపించింది. సెక్యూర్టీ సైరన్ మోగింది. భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే వాళ్లంతా పొజిషన్ తీసుకున్నారు. అలాగని.. పార్లమెంట్ పై ఎలాంటి దాడి జరగలేదు. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోనకర్ కారు పొరపాటున బూమ్ బారియర్‌ను ఢీకొట్టింది. దాంతో.. ఒక్కసారిగా పార్లమెంట్ ఆవరణలో హై అలర్ట్ వాతావరణం కనిపించింది.
గత యేడాది కూడా ఇలాగే జరిగింది. మణిపూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ కారు బారికేడ్లను ఢీకొట్టడంతో.. గేటు వద్ద ఉన్న స్పైక్స్ బయటకు వచ్చాయి. దీంతో ఆ ఎంపీ కారు డ్యామేజ్ అయ్యింది. కానీ ఆ ఘటన సమయంలో కారులో ఎంపీ లేరు. 2001లో పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన తర్వాత.. గేట్ల వద్ద స్పైక్స్‌లను అమర్చిన సంగతి తెలిసిందే.
