కరోనా కేసులు లెటెస్ట్ స్టేటస్ ఏంటీ ?

దేశంలో కరోనా రోజురోజూకి విజృంభిస్తోంది. నిన్నామొన్నా వందల్లో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు వేలల్లోకి చేరింది.
శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2902కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 68మంది మరణించగా 2650మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 184మంది కొవిడ్-19 నుంచి కోలుకున్నారని తెలిపింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనా కరోనా వైరస్ తీవ్రత పెరింగింది. తెలంగాణలో 229మంది వైరస్ బారినపడగా 11మంది మరణించిట్లు రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. మరో ఇద్దరు మృతి చెందారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ మృతుల సంఖ్య 19కు చేరింది. 423 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తరువాత అత్యధిక కేసులో తమిళనాడులోనే నమోదయ్యాయి. తమిళనాడులో వైరస్ అత్యంతవేగంగా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 411కు చేరింది.
