త్రిష టిక్‌టాక్ వీడియో.. టాప్ లేచిపోయింది !

కరోనా ప్రభావంతో దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో సినీ తారలు ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో కూర్చొని తమకి ఇష్టమైన పనులు చేస్తున్నారు. తమలోని స్పెషల్ టాలెంట్ ని బయటికి తీస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి వైరల్ అవుతున్నాయి. అభిమానులని ఖుషి చేస్తున్నాయి.
తాజాగా హీరోయిన్ త్రిష టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి వీడియోని షేర్ చేసింది. మేగాన్ థీ స్టాలియన్ సూపర్ హిట్ సాంగ్ కి.. షార్ట్ లో క్యూట్, క్యూట్ స్టెప్పులతో అదరగొట్టింది త్రిష. ఇంకా చెప్పాలంటే టాప్ లేపెసింది. ఇప్పుడు త్రిష టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
