తారక్-ప్రణతి.. పెళ్లిరోజు శుభాకాంక్షలు !

యంగ్ టైగర్ ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతిల పెళ్లిరోజు నేడు. ఈ సందర్భంగా ఈ ఆదర్శ దంపతులకి సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. మే 5, 2011లో తారక్-ప్రణతిల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దోడు పేరు అభయ్ర రామ్, బుడ్డోడి పేరు భార్గవ్ రామ్. సినిమాల నుంచి ఏమాత్రం సమయం దొరికినా.. తారక్ ఫ్యామిలీతో కలిసి గడుపుతుంటారు.
కరోనా లాక్డౌన్ తో ప్రస్తుతం ఇంటికే పరిమితమైన తారక్ ఫ్యామిలీతో గడుపుతున్నారు. ఇటీవల ‘బి ది రియల్ మ్యాన్’ వీడియోతో ప్రేక్షకులని పకరించారు తారక్. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో తారక్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది. ఇదీగాక, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తారక్ తో ఓ పిరియాడిక్ సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారమ్.
