రూ. 200 చెల్లిస్తే.. శ్రియతో ఆ పని చేయొచ్చు !

టైటిల్ చూసి.. ఇదేదో బూతు వార్త అనుకునేరూ.. ! ఇది అభినందించాల్సిన వార్త. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు హీరోయిన్ శ్రియ ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేస్తోంది.ఇందులో భాగంగా రూ. 200 చెల్లించి తనతో కలిసి డ్యాన్స్, యోగా చేయవచ్చంటూ ఆఫర్ ప్రకటించింది.

అయితే ఈ ఆఫర్ శనివారం సాయంత్రం వరకు మాత్రమే.. త్వరపడండీ.. అని శ్రియ తెలిపింది.దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని దినసరి కూలీలు, నిరాశ్రయులైన వృద్ధులు, వికలాంగులు, అనాథలకి అందజేయనున్నారు. www.thekindnessproject.in లో రూ.200 విరాళంగా చెల్లించి రిసిప్ట్‌ను ఈమెయిల్ చేయాలని శ్రియ తెలిపారు. ఇక ప్రస్తుతం శ్రియ భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్‌లో ఉంటున్నారు.