కరోనాపై కేంద్రం కొత్త గైడ్ లైన్స్.. ఇవే !

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఈరోజు రికార్డు స్థాయిలో 3900 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 195మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,568కి చేరింది. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46,433కు చేరింది. గడచిన 24 గంటల్లో 1,020 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో పాటు లాక్‌డౌన్ సంబంధించి కొన్ని కొత్త గైడ్ లైన్స్ ని విడుదల చేశారు.

పెళ్లి వేడుకకు 50 మంది మాత్రమే హాజరు కావాలి. అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలి. ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్యాలయాల్లో సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్‌ను తప్పనిసరి ఉండాలి. ఫేస్ మాస్క్‌లను, శానిటైజర్లకు సిబ్బందికి సరిపడా అందించాల్సిన బాధ్యత ఇంఛార్జ్‌లదే. ప్రతి ఒక్క ఉద్యోగి తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ను వినియోగించాలని కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శైల శ్రీవాత్సవ స్పష్టం చేశారు