శ్రీముఖిపై పోలీస్ కేసు.. ఎందుకంటే ?

ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ సీజన్ 3 రన్నర్ శ్రీముఖిపై పోలీస్ కేసు నమోదైంది. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో జరిగే ఓ కార్యక్రమంలో శ్రీముఖి బ్రాహ్మణులను అవమానించిందని నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కార్యక్రమ వీడియోలను కూడా చూపించాడు. శ్రీముఖితో పాటు టీవీ ఛానెల్ పై ఫిర్యాదు చేశాడు.
ఈ పోలీస్ కేసుకు సంబంధించి శ్రీముఖి స్పందించాల్సి ఉంది. అయితే శ్రీముఖీపై పోలీస్ కేసు అనే న్యూస్ ఆమె అభిమానులని షాక్ కి గురిచేస్తోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3 తర్వాత శ్రీముకి బుల్లితెరపై ఆఫర్లు పెరిగాయ్. వెండితెర ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే పనిలో ఉంది.
