ఆరోగ్యసేతు యాప్ లేకుంటే.. ఆర్నేళ్లు జైలు శిక్ష !

ప్రపంచ దేశాలని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ని ఆశ్రయించాయి. భారత్ లోనూ ఇప్పటికే 40 రోజులకిపైగా లాక్ డౌన్ ముగిసింది. ఈ నెల 17 వరకు కొనసాగనుంది. అయితే కరోనా లక్షణాలున్న వ్యక్తి మన దగ్గర్లోకి వస్తే హెచ్చరించే ఆరోగ్యసేతుయాప్ ని ప్రతి ఒక్కరు డౌన్ లోడ్ చేసుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది. హెచ్చరించింది. లేదంటే కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది.

తాజాగా నోయిడా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు షాక్ ఇస్తున్నారు. వాహనదారుల మొబైల్ ఫోన్లలో ఈ యాప్ లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 6 నెలల వరకు జైలుశిక్ష విధిస్తున్నారు.