గుడ్ న్యూస్ : షూటింగ్’లో జాయిన్ అయిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ అభిమానులకి గుడ్ న్యూస్. మహేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అలాగని.. ‘సర్కారు వారి పాట’ రెగ్యూలర్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. మరీ.. మహేష్ ఏ షూటింగ్ లో పాల్గొన్నారు అంటే.. ? ఓ యాడ్ షూటింగ్ లో. హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోస్ లో మహేష్ తో ఓ యాడ్ షూట్ స్టార్ట్ అయింది. ఈరోజు, రేపు ఈ యాడ్ షూటింగ్ కొనసాగుతుంది.
కరోనా లాక్ డౌన్ తర్వాత మహేష్ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో ఫ్యామిలీతో జాలీగా గడిపారు. పిల్లలతో ఆడుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులని ఖుషి చేశారు. ఇక 9 నెలల గ్యాప్ తర్వాత తొలిసారి మహేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకి అనుమతులు ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ్వరు ఇంకా పని మొదలెట్టలేదు. స్టార్ హీరోల్లో సెట్స్ మీదకు వచ్చిన మొదటి హీరో మహేష్ మాత్రమే. ఆయన తదుపరి సినిమా సర్కార్ వారిపాట పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మహేష్ కి జంటగా కీర్తి సురేష్ జతకట్టనుంది. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
