బ్రేకింగ్ : ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

ఏపీ ఎంసెట్–2020 ఫలితాలు విడుదలయ్యాయ్. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలని విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 84.7శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 91.77% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు.
గత నెల సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి. 9 సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్ విభాగానికి 1,85,946 మంది దరఖాస్తు చేయగా 1,56,899 మంది (84.38 శాతం) పరీక్ష రాశారు. ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు అగ్రి, మెడికల్ విభాగం పరీక్షలు జరగ్గా మొత్తం 87,652 మందికి గాను 75,834 (86.52%) మంది హాజరయ్యారు.
