ఐపీఎల్ : రాజస్థాన్’పై ఢిల్లీ విజయం – పాయింట్ల పట్టికలో టాప్ లోకి

ఐపీఎల్13లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ పై 46 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. మార్కస్ స్టాయినిస్ (39; 30 బంతుల్లో 4×6), హెట్‌మైయిర్ (45; 24 బంతుల్లో 1×4, 5×6) అదరగొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 19.4 ఓవర్లకు 138కే కుప్పకూల్చింది. రాహుల్ తెవాతియా (38; 29 బంతుల్లో 3×4, 2×6), యశస్వీ జైశ్వాల్ (34; 6 బంతుల్లో 1×4, 2×6) ఆ జట్టులో టాప్ స్కోరర్లు. రవి విచంద్రన్ అశ్విన్ (2/22), స్టాయినిస్ (2/17), రబాడా (3/35), నార్జె (1/25), అక్షర్ పటేల్ (1/8) సమయోచితంగా వికెట్లు తీశారు. దీంతో 46 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓటమిపాలైంది.
