దేశంలో కరోనా తగ్గుముఖం

దేశంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇటీవల రికవరీ అవుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో.. యాక్టివ్ కేసులు 8.83లక్షలకు పడిపోయాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో క్రియాశీలక కేసులు 12.65శాతానికి తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 82,753 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 85.81శాతానికి పెరిగింది.
ఇక గడిచిన 24 గంటల్లో 73,272 కొత్త కేసులు నమోదయ్యాయ్. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 69,79,424 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న మరో 926 మంది కరోనాకు బలవ్వగా.. మొత్తం మరణాల సంఖ్య 1,07,416కు చేరింది.
