రామ్ చరణ్’కు మళ్లీ పెళ్లి.. !?


దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా ఉంటుందని గతంలో జోరుగా ప్రచారం జరిగింది. అది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ కావొచ్చని చెప్పుకొచ్చారు. లేదంటే ? ‘ఘరానా మొగుడు’ సీక్వెల్ చేసినా బాగుంటుందని చెప్పుకొన్నారు. ఇప్పుడు రాఘవేంద్ర రావు రీ-ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో.. ఆయన దర్శకత్వంలో చరణ్ సినిమా చర్చ మళ్లీ మొదలైంది.

రాఘవేంద్రరావు త్వరలో చిరు తనయుడు రామ్‌ చరణ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. చెర్రీ 14వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు నెటిజన్లు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా అది పాన్‌ ఇండియ సినిమాగా రాబోతుందని చెప్పుకుంటున్నారు. ‘పెళ్లి సందడి’ మళ్లీ మొదలవ్వబోతుందని శుక్రవారం ప్రకటించారు దర్శకేంద్రుడు. అయితే ఈ సినిమా హీరో-హీరోయిన్స్ ఎవరు ? అన్నది ప్రకటించలేదు. బహుశా.. ఇది చరణ్ పెళ్లి సందడే కావొచ్చేమోనని ఆశపడుతున్నారు. అదే నిజమైతే.. రామ్ చరణ్ కి మళ్లీ పెళ్లి జరిగినట్టే.. !!