ఐపీఎల్-13లో రికార్డులు-అవార్డులు

ఐపీఎల్-13లో ముంబై విజేతగా నిలిచింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో దిల్లీని అయిదు వికెట్ల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.  అనంతరం బరిలోకి దిగిన ముంబయి 18.4 ఓవర్లలోనే అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్‌ శర్మ (68; 51 బంతుల్లో, 5×4, 4×6) అర్ధశతకంతో చెలరేగాడు. విజయంలో కీలకపాత్ర పోషించిన రోహిత్‌ అరుదైన ఘనత సాధించాడు. లీగ్ ఫైనల్లో రెండు సార్లు అర్ధశతకం సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు.

13వ సీజన్‌లో అవార్డులు :

* ఫెయిర్‌ప్లే అవార్డు: ముంబయి

* ఆరెంజ్‌ క్యాప్‌: కేఎల్‌ రాహుల్ (670 పరుగులు)

* పర్పుల్ క్యాప్: కగిసో రబాడ (30 వికెట్లు)

* ఎమర్జింగ్ ప్లేయర్‌: దేవదత్ పడిక్కల్‌ (473 పరుగులు)

* సూపర్ స్ట్రైకర్: పొలార్డ్‌ (191.42 స్ట్రైక్‌రేట్‌)

* అత్యంత విలువైన ఆటగాడు: జోఫ్రా ఆర్చర్ (20 వికెట్లు, 10 సిక్సర్లు)