పంత్ ఆఖరి పంచ్ అదిరింది.. కానీ !

రిషబ్ పంత్ ఆట చూడటానికి ఐపిఎల్ మెుత్తంగా వేచి చూడాల్సి వచ్చింది. ఐపీఎల్ 13లోదారుణంగా విఫలమవుతూ వస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ఫైనల్ లో మాత్రం రాణించాడు.రిషభ్ పంత్ (38 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నారు. అది కూడా జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో వచ్చి.. జట్టుని నిలబెట్టాడు.
ముంబై బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ దాటికి కుదేలైన బ్యాటింగ్ లైన్‌ప్‌ను చక్కదిద్దాడు. బౌల్ట్ వేసిన తొలి బంతికే స్టొయినిస్ (0) ఔట్ కాగా, అజింక్య రహానే (2), శిఖర్ ధావన్ (15) తక్కువ రన్స్‌కే పెవిలియన్ చేరారు. దీంతో 22 పరుగులకు 3 వికెట్లు కోల్పొయి కష్టాల్లో ఉన్న ఢిల్లీ శ్రేయస్ అయ్యర్ 50 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
ఈ సీజన్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వని పంత్ ఈ మ్యాచ్‌లో క్లాష్ షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే ఈమ్యాచ్ లో ఢిల్లీ ఓడిపోయింది. ఒకవేళ గెలిచి ఉంటే.. పంత్ ఆఖరి పంచ్ హిట్టయ్యేది. ప్లాప్ అయినా.. పంత్ పై వచ్చే యేడాది కూడా ఆశలు పెట్టుకునేలా చేసింది… ఈ ఇన్నింగ్స్.
