తెలంగాణ పోలీసుల‌తీరుపై హైకోర్టు సీరియ‌స్.. !!

తెలంగాణ పోలీసుల తీరుపై రాష్ట్ర హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రీసెంట్ గా పోలీసులు చేప‌ట్టిన స‌క‌ల నేర‌స్థుల స‌ర్వే పై ఓ వ్య‌క్తి కేసు వేశారు. ఈ విష‌యంలో తెలంగాణ పోలీసులు త‌న‌ను వేధిస్తున్నారంటూ ఆ వ్య‌క్తి కోర్టును ఆశ్ర‌యించారు. కేసును వెన‌క్కి తీసుకోవాలంటూ త‌న‌ను, త‌న కుటుంబ స‌భ్యుల‌ను వేధిస్తున్నారంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిష‌న‌ర్ అబ్ధుల్ హ‌ఫీజ్.

పోలీసుల తీరుపై హైకోర్టు మండిప‌డింది. కోర్టు ఆదేశాలు ఉన్న‌ప్ప‌టికీ పిటిష‌న‌ర్ ను ఎలా పోలీస్ స్టేష‌న్ కు పిలిపిస్తార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఏయే అధికారులు అత‌న్ని పిలిపించారు, ఎందుకు పిలిచార‌రో వివ‌రాలు, ఆధారాలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం త‌రుపు న్యాయ‌వాదికి హైకోర్టు ఆదేశించింది.