మెట్రోలో అప్పుడే ఊస్టింగులు… ఉద్యోగుల ఆందోళ‌న‌..!

మెట్రో ప్రారంభ‌మైన కొద్దిరోజులైందో లేదో అప్పుడే ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. త‌మ‌ను ఉద్యోగాల‌నుంచి అక‌స్మాత్తుగా తొల‌గించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నగరంలోని మెట్రో స్టేషన్ లలో అసిస్టెంట్లు గా పనిచేస్తున్న 100 మంది ఉద్యోగస్థుల తొలగింపుపై బాధితులు మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.

ట్రిగ్ అనే సంస్థ తమను జైన్ చేసుకొని మెట్రో స్టేషన్ లలో అసిస్టెంట్ లుగా నియమించిందని, ఎలాంటి సమాచారం లేకుండా తొలగించడంపై వారు ఆందోళనకు దిగారు. ఉద్యోగం కల్పిస్తామని ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయలు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మెట్రో స్టేషన్ లో పని చేసే స్టేషన్ అస్సిటెంట్ ఉద్యోగులను ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగులను తీసివేశారని, మియపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఆందోళన చేప‌ట్టారు.