కరోనా నుంచి కోలుకుంటున్న భారత్

కరోనా నుంచి దేశం కోలుకుంటోంది. రికవరీ రేటు భారీగా నమోదవుతోంది. శుక్రవారం ఒక్కరోజే 33,494 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో..మొత్తం రికవరీల సంఖ్య 93 లక్షల మార్కును దాటేసింది. ఇప్పటి వరకు దేశంలో 93,24,328 (94.89శాతం) మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు.

ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 30,006 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 98,26,775 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.  నిన్నటివరకు 3,59,819 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 3.66 శాతానికి తగ్గింది. మరోవైపు, గడిచిన 24 గంటల్లో 442 మంది మరణించగా.. మొత్తంగా కరోనా మృతుల సంఖ్య 1,42,628కి చేరింది.