రజనీని విష్ చేసిన ప్రధాని

సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. రజనీ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు.

మరోవైపు తన పొలిటికల్‌ ఎంట్రీపై సుదీర్ఘ కాలంగా ఉన్న సస్పెన్స్‌కు తెరదించుతూ పార్టీ ప్రారంభించనున్నట్లు రజనీ ఈ నెల 3న ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీని ప్రారంభిస్తామని తెలిపారు. పార్టీ ఏర్పాటు తేదీ, తదితర వివరాలను ఈ నెల 31న ప్రజలకు వెల్లడిస్తామన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ-అజెండాపై రజనీ కసరత్తు చేస్తున్నారు.

వచ్చే యేడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీ రాజకీయ రంగప్రవేశం ప్రాధాన్యతని సంతరించుకుంది. రజనీ పార్టీ భాజాపాకు మద్దతుగా వ్యవహరిస్తోంది. తమిళనాడులో భాజాపా బలపేతానికే రజనీకి రాజకీయాల్లోకి వస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రజనీ రాజకీయ అడుగులు ఎలా ఉండనున్నాయి అన్నది ఆసక్తిగా మారింది.