ఏపీలో జీరో కరోనా మరణాలు

ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 326 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,82,612కి చేరింది. నిన్న ఒక్కరు కూడా కరోనాతో మృతి చెందలేదు. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో 7,108 మంది కొవిడ్‌తో మృతి చెందారు.
గడిచిన 24 గంటల్లో 350 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,72,266కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,238 యాక్టివ్ కేసులున్నాయి. ఇక దేశంలో కొత్తరకం కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం కొత్త రకం కరోనా కేసులు ఇప్పటి వరకు నమోదుకాలేదు.
