వైరల్ : అక్షయ్’తో గబ్బర్ సెల్ఫీ

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ల సెల్ఫీ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చెరువుగట్టు పక్కన ఇద్దరూ సంతోషంగా నవ్వుతున్న ఫొటోను ధావన్ తన ఇన్ స్తా గ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.’మీతో ఉన్నంతసేపూ సరదాగా ఉంటుంది’ అని కామెంట్ పెట్టాడు. ఈ పిక్ పై అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు. ధావన్ హీరో అయిపోయాడు. ధావన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ధావన్-అక్షయ్ మల్టీస్టారర్ రాబోతుందని కామెంట్స్ పెడుతున్నారు.
ఆసీస్ పర్యటనకు ముందు యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో ధావన్ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో అతడు 17 మ్యాచ్ల్లో 618 పరుగులు చేశాడు. అందులో రెండు వరుస శతకాలు బాది ఐపీఎల్లో కొత్త రికార్డు నెలకొల్పాడు. అయితే గాయం కారణంగా ఆసీస్ టూర్ కి దూరమయ్యాడు. గాయం ఇంకా నయం కాకపోవడంతో ఇంగ్లండ్ త్వరలో జరగనున్న టెస్ట్ సిరీస్ కి కూడా ధావన్ ఎంపిక కాలేదు. ఆయన స్థానంలో జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు శుభమన్ గిల్ బాగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.
