తెరాస ఎమ్మెల్యే దానం నాగేందర్’కు 6నెలల జైలు శిక్ష

బంజారాహిల్స్‌లో 2013లో నమోదైన కేసులో ఖైరతాబాద్ తెరాస ఎమ్మెల్యే దానం నాగేందర్ ను ప్రజాప్రతినిధుల కోర్టు దోషిగా తేల్చింది. ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారనే అభియోగాలు రుజువు కావడంతో నాగేందర్‌కు జైలు శిక్ష విధించింది.
రూ.1000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీనిపై అప్పీల్‌కు వెళ్లేందుకు అనుమతించిన న్యాయస్థానం.. శిక్ష అమలును నెల రోజులు వాయిదా వేసింది. ఈలోగా దానం పై కోర్టుకు వెళ్లి.. క్లీన్ చీట్ తెచ్చుకోవాలి. లేదంటే.. ? దానంకు ఆర్నెళ్ల జైలు శిక్ష అనుభవించాల్సిందే.
