ఎన్టీఆర్ షోలో సమంత.. ఏం చెప్పారు.. ఎంత గెలుచుకున్నారు ?

ఇన్నాళ్లు జరుగుతున్న ప్రచారం నిజమైంది. సమంత ఎన్టీఆర్ షోకి వచ్చారు. తారక్ హోస్ట్ గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షోకి సామ్ స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భర్త నాగ చైతన్యతో విడిపోతున్నట్టు ప్రకటించిన తర్వాత సామ్.. పాల్గొన్న మొదటి షో ఇది. దీంతో.. ఈ ఏపీసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సామ్-చై విడిపోవడంపై రకరకాల ప్రచారం జరుగుతుంది. అక్కినేని లాంటి ఫ్యామిలీని వదులుకోవడం సామ్ చేసిన పెద్ద తప్పు అని అంటున్నారు. అంతేకాదు.. సామ్ కు ఎఫైర్స్ ఉన్నాయి. పిల్లలు కనేందుకు నో చెప్పేసింది. గ్లామర్ షో వలనే ఆమె కాపురం కూలిపోయింది. ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అయితే దీనిపై స్పందించిన సామ్… తనకు ఎలాంటి ఎఫైర్స్ లేవని క్లారిటీ ఇచ్చింది. తారక్ షోలో విడాకులపై సామ్ మరింత స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక సినిమా విషయానికొస్తే.. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం పూర్తికావొస్తున్నది. ఇక ఒకేసారి సామ్ మూడు సినిమాలని ప్రకటించబోతుందనే ప్రచారం జరుగుతుంది. బహుశా.. ఈ వారంలోనే ఆ ప్రకటనలు ఉంటాయని చెబుతున్నారు. వ్యక్తిగత జీవితంలో అడ్డంకులు ఎదురైనా.. కెరీర్ లో మాత్రం దూసుకెళ్లాలని సామ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

Beard lo @tarak9999 🤩 !!
Looks ✨ #KomaramBheemNTR #ManOfMassesNTR #RRRMovie #MEK #MeeloEvaruKoteeswarulu #JrNTR #JaiNTR #SamanthAkkineni #SamanthaRuthPrabhu #Samanthaprabhu #Samantha pic.twitter.com/rLHn92Edd3— OTTRelease (@ott_release) October 10, 2021