మా ఎన్నికలు : పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్

మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ముగిశాయి. మొత్తం 665 ఓట్లు పోలయ్యాయి. చిన్న చిన్న ఘటనలు తప్పా.. అంతా ప్రశాంతంగానే ఓటింగ్ జరిగిందనుకుంటున్న టైమ్ లో నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత పూనమ్ మీడియాతో మాట్లాడింది. టాలీవుడ్లో చాలా రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించింది. రాజకీయ లబ్ధి కోసం ఆర్టిస్టులను సతాయించడం మానుకోవాలని తెలిపింది. ఏ ప్యానల్ గెలిచినా..
రాజకీయాలను, మా అసోసియేషన్ను కలపకూడదని కోరుకుంటున్నాను ఆమె
చెప్పుకొచ్చింది.
ఇక పూనమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భక్తురాలిగానే కనిపిస్తుంటుంది. కానీ పవన్ ని టార్గెట్ చేసినట్టు ఆమె వ్యాఖ్యలు, ఆమె పోస్టులు ఉంటాయి. ఇటీవల ‘పీకే లవ్’ అంటూ పోస్ట్ పెట్టి ఆశ్చర్యపరిచింది. మరోవైపు పవన్ కారణంగా పూనమ్ తల్లయింది. ఆమెతో బలవంతంగా అబార్షన్ చేయించారనే ఆరోపణలున్నాయి. ఇటీవల పవన్ వర్సెస్ పోసాని ఏపీసోడ్ లోనూ ఇటువంటి వ్యాఖ్యలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఎలాంటి ఆరోపణలు వచ్చినా.. పవన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే పనులు మాత్రం పూనమ్ అస్సలు చేయదు. ఎందుకంటే.. ఆమె పవన్ భక్తురాలు. అంతుకుమించి.
