హైదరాబాద్ లో 5జీ ఎక్కడ సర్ జీ.. !

దేశంలో 5జీ సేవలు ఇటీవలే ప్రారంభం అయ్యాయి. మొదట 8 ప్రధాన నగారాలకు 5 జీ సేవలు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. ఇందులో హైదరాబాద్ కూడా ఉంది. అయితే 5జీ సేవల కోసం వెయిట్ చేసిన భాగ్యనగర వాసులకు ఎయిర్టెల్ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు 5జీ సేవలు కాదు కదా.. ! 5జీ సిగ్నల్స్ కూడా కనిపించడం లేదు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఎక్కడ 5జీ సిగ్నల్ వస్తుందో చెప్పండయ్యా అంటూ.. ట్విట్టర్ గోడలు ఎక్కి మరీ తిడుతున్నారు. ఇప్పటివరకైతే.. 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల గురించి ఎయిర్టెల్ అయితే ప్రకటించలేదు. దీంతో వినియోదారులు గందరగోళానికి గురవుతున్నారు.