‘శ్రీనివాస కళ్యాణం’ సెలబ్రెటీ రివ్యూ

థియేటర్స్ లోకి ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా వచ్చిందంటే.. పండగొచ్చినట్టే. ఎంచక్కా కుటుంబం అంతా కలిసి థియేటర్ కు వెళ్లి సినిమా చూడొచ్చు. ఈ గురువారం (ఆగస్టు9) ఓ పండగ జరగనుంది. ‘శ్రీనివాస కళ్యాణం’ పండగ. ‘శతమానం భవతి’ లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందిస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ శ్రీనివాస కళ్యాణం. నితిన్‌, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ షో పడిపోయింది. సెలెబ్రిటీల కోసం నిర్మాత దిల్ రాజు ‘శ్రీనివాస కళ్యాణం’ స్పెషల్ షో వేయించారు.

సినిమా చూసిన సినీ ప్రముఖుల స్పందన ‘శ్రీనివాస కళ్యాణం’పై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. దర్శకులు త్రినాథ్ రావు, ఇంద్రగంటి, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి.. తదితరులు సినిమాని చూసేశారు. వీరంతా ‘శ్రీనివాస కళ్యాణం’ అద్భుతంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్, నితిన్ మధ్య జరిగే సంభాషణ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని తెలిపారు.

పెళ్లి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలని ఈ చిత్రంలో ప్రభావవంతంగా చూపించారట. అందుకే తన భ్యారని మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉందన్నారు దర్శకుడు అనిల్ రాఘవపూడి. పెళ్లైన వారు వారిని వారు ఈ చిత్రంతో గుర్తు చేసుకుంటారు. పెళ్లి కానీ వారు తమ పెళ్లి ఇలా జరగాలని కోరుకుంటారుని వంశీపైడి అన్నారు. మొత్తంగా.. సినిమా చూసిన సెలబ్రేటీస్ ‘శ్రీనివాస కళ్యాణం’కు టాప్ రేటింగ్స్ ఇచ్చేశారు. ఇక, ప్రేక్షకుల రేంటింగ్స్ ఎలా ఉంటాయన్నది చూడాలి.