విజయ్ దర్శకుడితో బన్నీ సినిమా

‘సోలో’ దర్శకుడు పరశురామ్ ‘శ్రీరస్తు శుభమస్తు’తో గీతాఆర్ట్స్ కంపౌండ్ లో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో శిరీష్ ని చూపించిన విధానం అల్లు అరవింద్ కు బాగా నచ్చేసింది. వెంటనే పరశురామ్ కు మరో అవకాశం ఇచ్చారు. అదే ‘గీత గోవిందం’. విజయ్ దేవరకొండ-రష్మిక మందన జంటగా నటించారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘శ్రీరస్తు శుభమస్తు’ విడుదలైన సమయంలోనే పరశురామ్ స్టయిలీష్ స్టార్ బన్నీతో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయ్. తాజాగా, ఈ వార్తలపై దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. బన్నీతో ఉన్న స్నేహం వల్ల తనకి తరచూ కథలు వినిపించేవాణ్ని. ‘గీత గోవిందం’ కథని కూడా ముందుగా బన్నీకే వినిపించా. బన్నీతో త్వరలోనే సినిమా చేస్తానన్నారు.
గీతాఆర్ట్స్ లో పరశురామ్ హ్యాట్రిక్ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే పరశురామ్.. అల్లు అరవింద్ కు ఓ కథని వినిపించారట. ఐతే, బన్నీతో మాత్రం కాదు. ఇతర హీరోతో ఉటుందట. పరశురామ్ వాలకం చూస్తుంటే.. ఇప్పట్లో గీతాఆర్ట్స్ నుంచి బయటికి వచ్చేలా కనిపించడం లేదు. మరోసారి అల్లు శిరీష్, ఆ తర్వాత బన్నీతో ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్.
