యాక్షన్ లోకి దిగిన సూపర్ స్టార్


సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి వచ్చిన కబాలి, కాలా సినిమాలు ప్రేక్షకులని నిరాశపరిచాయి. ఈ రెండు చిత్రాలకు పా. రంజిత్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు రజనీ ప్రేక్షకులంతా రోబో 2.ఓ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ 29న 2.ఓ విడుదల తేదిని ఖరారు చేసుకొంది. ఇక, కాలా తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా డార్జిలింగ్ లో షూటింగు జరుపుకుంటోంది. ఇక్కడ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 25రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ సినిమాలో రజనీ సరసన సిమ్రాన్ జతకట్టనుంది. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. బాబీ సింహా, ఫహాద్ ఫాజిల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ.. తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.