అతిలోక సుందరి రకుల్ నే !


మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ ‘ఎన్టీఆర్’ పేరిట తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్ ఎన్టీఆర్ సొంత గ్రామం నిమ్మకూరులో కొనసాగుతోంది. ఐతే, ఎన్టీఆర్ సినిమాలో శ్రీదేవిగా కనిపించేది ఎవరు ? అనే ఆసక్తి నెలకొంది. మొదటి నుంచి ఆ అతిలోక సుందరి రకుల్ ప్రీత్ సింగ్ నే అనే ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటు శ్రీదేవి పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్‌, సోనాక్షి సిన్హా, శ్రద్ధా కపూర్‌ల‌ పేర్లు వినిపించాయి. వీరిలో శ్రీదేవి ఎవరు ? అనేది సస్పెన్స్ గా మారింది.

ఇప్పుడా సస్పెన్స్ కు తెరపడింది. అతిలోక సుందరి రకుల్ నే అని తేలిపోయింది. సినిమా నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి‌ శ్రీదేవి పాత్రపై స్పష్టత ఇచ్చారు. ఓ ఆంగ్లపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. “మేం సోనాక్షి, కంగన, శ్రద్ధలను కలవలేదు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మా మొదటి ఎంపిక. ఆమెకు దక్షిణాదిలో చాలా పాపులారిటీ ఉంది. ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉందని చెప్పుకొచ్చారు విష్ణు.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎన్ టీఆర్ సినిమా స్టార్స్ తో నిండిపోయింది. ఎన్ టీఆర్ గా బాలయ్య, ఆయన భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, కైకాల, మోహన్ బాబు, ప్రకాష్ రాజు, రానా దగ్గుపాటి, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్.. తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.