రోహిత్.. సచిన్’ని మించిపోయేలా.. !

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ భయంకరమైన ఫామ్ లో ఉన్నాడు. సింగిల్ తీసినంత ఈజీగా సెంచరీలు బాదేస్తున్నాడు. ఈ ప్రపంచకప్ లో ఇప్పటికే ఐదు సెంచరీలు కొట్టేశాడు. సచిన్ సరసన నిలిచాడు. ఇప్పటి వరకు శ్రీలంక ఆటగాడు సంగక్కర (4) పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును చెరిపేశాడు. అంతే కాదు మొత్తం ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు సచిన్‌ (6) సరసన నిలిచాడు.

2003 ప్రపంచకప్‌లో సచిన్ 673 పరుగులు సాధించాడు. 2007 ప్రపంచకప్‌లో మాథ్యూ హెడెన్‌ 659 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానంలో రోహిత్‌ 647 నిలిచాడు. ఈ ప్రపంచకప్ లో రోహిత్ ఇంకా సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లని ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు సాధించిన సచిన్ రికార్డుని రోహిత్ బద్దలు కొట్టనున్నాడు. అంతేకాదు.. ఇన్నాళ్లు సచిన్ వారసుడు విరాట్ కోహ్లీగా పిలుచుకొనేవారు. ఇప్పుడు రోహిత్ దూసుకొచ్చాడు. సచిన్ లా స్టయిల్ గా బ్యాటింగ్ చేసే రోహిత్ నే సచిన్ వారసుడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.