వర్షం ఎలిసింది.. ఆట మొదలైంది !

వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ లో నేడు మొదటి వన్డే జరుగుతోంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయింది. దీంతో ఆటని 43ఓవర్లకి కుదించారు. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకొంది.
ప్రపంచకప్ తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి వన్డే ఇది. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ వన్డే సిరీస్‌ను కూడా విక్టరీతో మొదలుపెట్టాలని అనుకుంటుంటే సొంతగడ్డపై జరుగుతున్న సిరీస్‌ను గెలవాలని విండీస్ పట్టుదలతో దిగుతుంది.
