విజయవాడ-విశాఖ మధ్య ఉదయ్ ఎక్స్‌ప్రెస్

విజయవాడ-విశాఖ మధ్య ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ రైలు నడిపేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. వారానికి ఐదు రోజులు నడపనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాసిన లేఖపై ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అయితే ఎప్పటి నుంచి నడిపేది వివరాలు తెలియరాలేదు.
దేశంలో ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మూడింటిని కేంద్ర రైల్వేమంత్రి ప్రకటించారు. అందులో విశాఖ – విజయవాడ మధ్య ఒకటి నడిపేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఇదే మొదటిది కావడం విశేషం. ఈ రైలును ప్రకటించి చాలా రోజుల తర్వాత ఇటీవలే దాన్ని విశాఖ తీసుకొచ్చారు. ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.
