24గంటల్లో.. 1480 మంది మృతి !

నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదు. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. అమెరికాలో కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చింది. శుక్రవారం ఒక్కరోజే అమెరికాలో 1480 మంది మరణించారు. గురువారం రాత్రి 8:30 గంటల నుంచి శుక్రవారం రాత్రి అదే సమయానికి తేలిన లెక్క ఇది.

ఇప్పటివరకు అగ్రరాజ్యంలో మృతిచెందినవారి సంఖ్య 7,406కి చేరింది. బాధితుల సంఖ్య 2,77,828గా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సంఖ్య 10,98,848కి చేరగా మరణాల సంఖ్య 58,871కు చేరుకొంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు మరో నాలుగు వారాల పాటు ఇళ్లకే పరిమితవ్వాలని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే సూచించారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని, దాంతోపాటు సామాజిక దూరం పాటించాలని సూచించాడు.