జియో 1.15 శాతం వాటాకు రూ.5655.75 కోట్లు

ఇటీవలే ఫేస్ బుక్ జియో ప్లాట్ ఫామ్స్ లో 9.99% వాటాను రూ.43,574 కోట్లకు (5.7 బి.డాలర్ల) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సాంకేతిక సంస్థల్లో పెట్టుబడి పెట్టే ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ సిల్వర్ లేక్ పార్ట్ నర్స్ జియో ప్లాట్ ఫామ్స్ లో 1.15 శాతం వాటా కోసం రూ.5655.75 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది.
జియో ప్లాట్ ఫామ్స్ ఎంటర్ ప్రైజ్ విలువను రూ.4.62 లక్షల కోట్లుగా పరిగణించి, 9.99 శాతం వాటాను ఫేస్ బుక్ రూ.43,574 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 4000 కోట్ల డాలర్ల నిర్వహణ ఆస్తులను కలిగిన సిల్వర్ లేక్ తాజా పెట్టుబడుల ఫలితంగా తమ అనుబంధ జియో ప్లాట్ ఫామ్స్ ఈక్విటీ విలువ రూ.4.90 లక్షల కోట్లకు, ఎంటర్ ప్రైజ్ విలువ రూ.5.15 లక్షల కోట్లకు చేరుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.
