గోడ కూలి.. ముగ్గురు చిన్నారుల మృతి !

గద్వాల జిల్లా కొత్తపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు చనిపోయారు. నిన్న కురిసిన వర్షానికి ఇంట్లో నిద్రిస్తున్న ఏడుగురిపై గోడ కూలింది. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మృతిచెందారు.

ఇందులో ముగ్గురు చిన్నాలు ఉండటం కలచివేస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫోన్‌ చేసి ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. మృతులకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని సీఎం ఆదేశించారు.  \