కాబోయే వాడిని పరిచయం చేసిన రకుల్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సడెన్ సప్రైజ్ ఇచ్చింది. బాలీవుడ్
నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్టు ప్రకటించింది. జాకీ
భగ్నానీతో కలిసి దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ‘థ్యాంక్ యు మై
లవ్. ఈ సంవత్సరం నేను అందుకున్న అతిపెద్ద బహుమతి నువ్వే. నా జీవితంలో
రంగులు నింపినందుకు, నన్ను నవ్విస్తున్నందుకు ధన్యవాదాలు’ అని జాకీని
ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. రకుల్ ఇచ్చిన సడెన్ సప్రైజ్ తో ఆమె
అభిమానులు ఖుషి అవుతున్నారు. రకుల్ కు అభినందనలు చెబుతున్నారు. అదే
సమయంలో జాకీ భగ్నానీ ఎవరు ? అన్నది తెలుసుకొనేందుకు ఆసక్తి
చూపిస్తున్నారు.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత వశు భగ్నానీ తనయుడే జాకీ భగ్నానీ. స్వస్థలం
కోల్‌కతా. ఉన్నత విద్యని అభ్యసించిన ఆయన ‘లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్
అండ్ ది ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్’ (న్యూయార్క్)లో యాక్టింగ్ కోర్సు
పూర్తి చేశారు. ‘రెహ్నా హై తేరే దిల్ మే’ చిత్రంతో నటుడిగా మారారు.
అతిథి పాత్రలో మెప్పించారు. ‘కల్ కిస్నే దేఖా’ సినిమాతో కథానాయకుడిగా
పరిచయమయ్యారు. ‘ఫాల్తు’, ‘అజబ్ గజబ్ లవ్’, ‘యంగిస్థాన్’, ‘వెల్‌కమ్
టు కరాచీ’ తదితర చిత్రాలతో అలరించారు. ‘మెహిని’ అనే చిత్రంతో
కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘సర్జ్బిత్’, ‘దిల్ జంగ్లీ’, ‘వెల్‌కమ్
టు న్యూయార్క్’, ‘కూలీ నం. 1’, ‘బెల్ బాటమ్’ తదితర చిత్రాలకి
నిర్మాతగా వ్యవహరించారు. అయితే రకుల్-జాకీ భగ్నానీకి ఎక్కడ పరిచయం
అయింది. ఎలా ప్రేమలో పడ్డారు ? ముందు ఎవరు ప్రపోజ్ చేశారు. తదితర విషయాలు
తెలియాల్సి ఉంది.
