ఫుల్ మూడ్ లో జాన్వీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ‘ధడక్’ (2018) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే హిట్ కొట్టింది. తాను సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకుంది. ఆ తర్వాత ఏడాది (2019) గ్యాపి చ్చిన 2020 లో రెండు సినిమాలు.. 2021 లో ఓ సినిమా (రూహి) చేసింది. గత ఏడాది గుడ్ లక్ జెర్రీ, మిలి సినిమాలతో సందడి చేసింది. ఇక ఈ ఏడాది బావల్, మిస్టర్ & మిస్సెస్ మాహి సినిమాల్లో నటిస్తోంది. అయితే సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాను ఏలుతుంది.. ఈ ముద్దుగుమ్మ.

ఏ మాత్రం గ్యాప్ లేకుండా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. సినిమాలు ఉన్నా.. లేకున్నా… సరికొత్త ఫోటో షూట్స్ లో అభిమానులను అలరిస్తుంటుంది. ఇక సినిమా ఫంక్షన్లు, సెలబ్రిటీల పార్టీలలో జాన్వీ పోజులు టాప్ లో ఉండాల్సిందే. పోటీలో ఎవరు ఉన్నా ఈ యంగ్ బ్యూటీ అందాలు హైలైట్ కావాల్సిందే. అంతలా.. తన అందాలకు కుర్రకారుని దాసోహం చేసుకుంది. సండే లేదు మండే లేదు ఎనీ టైమ్ లో ఆన్ మూడ్ అంటోంది. తాజాగా సండే మూడ్ అంటూ రెండు ఫోటోలు షేర్ చేసింది. అందులో ఫుల్ మూడ్ లో కనిపిస్తుంది. 

ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎంట్రీ ఇస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గతంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం జాన్వీ ని అడిగారట. కానీ ఆ సమయంలో ఆమె బిజీగా ఉండటం వలన కుదరలేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్ టీఆర్ నటిస్తున్న సినిమా కోసం జాన్వీ పేరు ఖరారు అయింది అంటున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముందుగా ఈ సినిమా కోసం అలియా భట్ ని తీసుకున్నారు. ఆమె గర్భవతి కావడం.. పిల్లకు జన్మనివ్వడంతో.. ఆమె స్థానంలో జాన్వీని తీసుకున్నారని తెలుస్తోంది.