నైట్ టైమ్ లో అనన్య డ్యాన్సులు.. వైరల్ !

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నైట్ టైమ్ లో రెచ్చిపోయింది. అందంగా ముస్తాబై.. చూడముచ్చటగా డ్యాన్స్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇవి ఆమె నటిస్తున్న ‘డ్రీమ్ గర్ల్ 2’ సినిమాకు సంబంధించినవి. రాజ్ శాండిల్య దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా – అనన్య పాండే జంటగా డ్రీమ్ గర్ల్ 2 తెరకెక్కుతోంది. ఏక్తా కపూర్, శోభ కపూర్ నిర్మాతలు. జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ముంబైలో వేసిన సెట్స్ లో ఓ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. దీని కోసం రెండు చేతుల నిండా గాజులు ధరించి.. చమ్కీల డ్రెస్ లో అనన్య అందంగా ముస్తాబైంది. అదిరిపోయే స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన స్నేక్ పీక్ ని ఈ ముద్దుగుమ్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. గ్లో అంటూ కామెంట్ పెట్టింది.  ఈ ఏడాది అనన్య డ్రీమ్ గర్ల్ 2 తో పాటు ఖో గయే హమ్ కహాన్, రూబీ చిత్రాల్లో నటిస్తోంది. ఇక లైగర్ తో ఈ ముద్దుగమ్మ తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. లైగర్ ప్లాప్ కావడం నిరాశపరిచినా.. రాబోయే రోజుల్లో మరిన్ని తెలుగు సినిమాలు చేసేందుకు అనన్య రెడీగా ఉన్నట్లు సమాచారం.