‘హాయ్ నాన్న’ ఇక ఓటీటీలో చూసేయండీ !

ఇన్నాళ్లు ప్రేక్షకులు కొత్త సినిమా థియేటర్లకు ఎప్పుడు వస్తుందా ? అని ఎదురు చూసేవారు. ఇప్పుడు థియేటర్స్ కి వచ్చిన సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా ? అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ ఫిల్మ్ హాయ్ నాన్న కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురు చూపులకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈరోజు అర్థరాత్రి (12 NOON) నుండి హాయ్ నాన్న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

ఈ సినిమాకి శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. తండ్రీకూతుళ్ల ఎమోషన్స్ ప్రధానంగా నడిచే కథ ఇది. నాని జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. డిసెంబర్ 7న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ప్రభాస్ ‘సలార్’ పోటీని తట్టుకొని బ్రేక్ ఈవెన్ ను అందుకుంది. జెర్సీ తర్వాత మరోసారి ఏమోషనల్ టచ్ ఉన్న సబ్జెక్ట్‌తో నాని చేసారు.   జెర్సీలో తండ్రీ తనయులు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కితే.. తాజాగా  ‘హాయ్ నాన్న’ మాత్రం తండ్రీ కూతుళ్ల నేపథ్యంలో తెరకెక్కింది. అంతేకాదు.. నానికి ఇప్పటి వరకు 8 మిలియన్ డాలర్ల సినిమాలు ఉన్నాయి. ఇక హాయ్ నాన్నతో 9 సినిమాలు అమెరికాలో వన్ మిలియన్ సాధించినట్టు అయ్యింది. నాని కంటే ముందు సూపర్ స్టార్ మహేష్ బాబుకు 11 సినిమాలతో టాప్ లో ఉన్నాడు.