కోహ్లీ X విలియమ్సన్‌ రెండోసారి.. !


టీమిండియా సెమీస్ ప్రత్యర్థి కివీస్. మంగళవారం టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌తో సెమీస్‌ ఆడనుంది. శనివారం
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న కోహ్లీసేన నాలుగో స్థానంలో ఉన్న విలియమ్సన్‌ జట్టుతో మంగళవారం పోటీపడనుంది. ఐతే, సెమీస్‌లో చరిత్ర పునరావృతం కానుంది.

2008 అండర్‌ 19 ప్రపంచకప్‌ సందర్భంగా కోహ్లీ భారత జట్టుకు, విలియమ్సన్‌ న్యూజిలాండ్‌ జట్టుకు నాయకత్వం వహించారు. మలేషియా వేదికగా జరిగిన ఆ టోర్నిలో కోహ్లీసేన మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌ చేరింది. దాదాపు 11ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ సెమీస్‌లో కోహ్లీ X విలియమ్సన్‌ మరోసారి తలపడుతున్నారు. ఈ సారి విజయం ఎవరిని వరిస్తుంది ? ఎవరు ఫైనల్ చేరుతారు అన్నది చూడాలి.