పది వేల మంది ఆకలి తీరుస్తున్న దాదా

దేశంలో కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారధి పేదల ఆకలి తీరుస్తున్నాడు. ప్రతి రోజు పది వేల మందికి భోజన సదుపాయం కల్పించేలా కోల్‌కతాలోని ఇస్కాన్‌కు విరాళాన్ని అందించాడు.

“కోల్‌కతాలోని ఇస్కాన్‌ కేంద్రం ప్రతి రోజు పది వేల మందికి భోజనం అందిస్తుంది. సౌరవ్‌ గంగూలీ ముందుకు వచ్చి మాకు మద్దతు ఇచ్చాడు. విరాళాన్ని అందించాడు. దీంతో మేం రోజూ ఇక 20వేల మందికి ఆహారాన్ని అందిస్తాం. గంగూలీ సారథ్యంలో ఇస్కాన్‌ బృందం సుదీర్ఘ టెస్టును ఆడనుంది. ప్రజల ఆకలిపై పోరాడనుంది. మైదానంలో దాదా గొప్ప ఇన్నింగ్స్‌లు ఎన్నో చూశాం. కానీ ప్రతి రోజు పది వేల మందికి ఆహారాన్ని అందించడమే అతడి అత్యుత్తమ ఇన్నింగ్స్‌. అతడి చేస్తున్న సేవలకు ఇస్కాన్‌ తరఫున ధన్యవాదాలు” అని కోల్‌కతాలోని ఇస్కాన్‌ ఉపాధ్యక్షుడు రాధారమణ్‌ దాస్‌ తెలిపారు.