కరోనా నుంచి దేశం కోలుకుంటోందోచ్ !

కరోనా నుంచి భారత్ కోలుకుంటోంది. కొత్త కేసులు సంఖ్య తగ్గడంతో పాటు.. రికవరీ అవుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 5లక్షలకు దిగువగా చేరాయి. గడిచిన 24 గంటల్లో 44,281 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కోలుకున్న వారి సంఖ్య 50,326గా ఉంది. ఈ మహమ్మారి కారణంగా మంగళవారం 512 మరణాలు సంభవించగా, ఇప్పటివరకు ఈ వైరస్‌ బారినపడి 1,27,571 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో క్రియాశీల కేసులు సంఖ్య 4,94,657 గా ఉండగా..ఈ రేటు 5.73 శాతానికి తగ్గింది. కాగా, 106 రోజుల తరవాత మొదటి సారి క్రియాశీల కేసులు సంఖ్య ఐదు లక్షల దిగువకు చేరడం ఊరట కలిగించే విషయం. అలాగే వైరస్ బారినపడి కోలుకున్న వారి శాతం 92.79గా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 86,36,011 మంది వైరస్ బారిన పడగా, వారిలో 80,13,783 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు.