డేంజర్ : 24 గంటల్లో.. 93,249 కొత్త కేసులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. అత్యంత వేగంగా కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 93,249 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,85,509కి చేరింది. కొత్తగా 60,048మంది కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,16,29,289కు చేరి.. రికవరీ రేటు 93.36శాతానికి పడిపోయింది. 

ఇక నిన్న 513 మంది కరోనాతో మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,64,623కు పెరిగింది. ఇక మరణాల రేటు 1.32 శాతానికి చేరింది.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 6,91,597కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా సాగుతోంది. గడిచిన 24గంటల్లో 27.38లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 7,59,79,651కి చేరింది.  

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,321 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో ఇప్పటి కరోనా సోకిన వారి సంఖ్య 3,12,140కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,923 యాక్టివ్‌ కేసులున్నాయి.  నిన్న కరోనాతో ఐదుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,717కి చేరింది. నిన్న 293 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,886 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.