కోర్టు తీర్చిన కోరిక…!

జీవితాంతం అన్నాదురైతో కలిసున్న తమళ రాజకీయ యోధుడు కరుణానిధి ఆయన చివరి మజిలీని అన్నాదురై సమాధి వద్దే చేయాలని భావించింది డీఎంకే. కరుణానిధి కుటుంబ సభ్యులు ఇందుకోసం తమిళ ప్రభుత్వానికి వినతి పంపించారు. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే చట్టపరమైన చిక్కుల నేపథ్యంలో తాము మెరీనా బీచ్ లో అంత్యక్రియలకు అనుమతివ్వలేమని, ప్రభుత్వం లాంఛనాలతో వేరే చోట అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
అయితే ప్రభుత్వ వైఖరిని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది డీఎంకే పార్టీ. అత్యవసర పిటిషన్ గా విచారణ చేపట్టిన కోర్టు మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలకు అనుమతి ఇస్తూ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుపై డీఎంకే నేతలు హర్షం వ్యక్తం చేశారు. సాయంత్రం 4 గంటలకు మెరీనా తీరానికి కరుణానిధి భౌతికకాయాన్ని తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం సందర్శనకు ఉంచిన రాజాజీహాల్ నుంచి సాయంత్రం కరుణ అంతిమయాత్ర మొదలవుతుంది.
